డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో, పేద వాళ్ళ పిల్లలు తెలుగు మీడియంలో

దేశంలో ఇంగ్లిష్ నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అని అందరికీ తెలుసు. నేనేమీ ఇంగ్లిష్ మీడియం బోధనకి వ్యతిరేకం కాదు కానీ డబ్బున్న వాళ్ళ పిల్లలకి విద్యా బోధనలో ఒక రకమైన ప్రమాణాలు, పేద వాళ్ళ పిల్లలకి వేరే రకమైన ప్రమాణాలు విధానానికే నేను వ్యతిరేకం. “పొద్దు“లో తెలుగు మీడియం విద్యా బోధన గురించి చర్చ జరిగింది. చర్చలో భాగంగా తెలుగు మీడియం టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారో చెప్పాను. ఆ సమాధానానికి చర్చతో సంబంధం లేదని అబద్దం చెప్పి నా సమాధానాలు డిలీట్ చేశారు.

“ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నారు. తెలుగు వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. హిందీ లేదా ఇంగ్లిష్ వస్తే దేశంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అందు కోసం రెండు మూడు బాషలు నేర్చుకోవాలి కూడా. అందుకే నేను తెలుగు మెడియం కాకుండా హిందీ లేదా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉండాలంటున్నాను.”

ఈ సమాధానం వాళ్ళకి చర్చతో సంబంధం లేని సమాధానంలా కనిపించిందట! ఇది డిలీట్ చెయ్యకపోయినా, తరువాత వ్రాసినవి డిలీట్ చెయ్యడం జరిగింది. ఇక్కడ కత్తి మహేష్, కెక్యూబ్ వర్మ గారు మాత్రమే నిజాలు మాట్లాడారు. కెక్యూబ్ వర్మ గారు స్కూళ్ళలో పాటించే ప్రమాణాల గురించి మంచి ప్రశ్నలు వేశారు. పిల్లల మెడలో బోర్డులు తగిలించిన స్కూల్ క్రైస్తవ స్కూల్ కాబట్టే ఆ స్కూల్ మీద అంత విరిచుకుపడ్డారు. పిల్లల మెడలో బోర్డులు కట్టడం తప్పే కానీ ఇందులో తల్లితండ్రుల తప్పు కూడా ఉంది. స్కూల్ లో టీచర్లు పాటించే పనిష్మెంట్ విధానం గురించి ఆలోచించే తల్లితండ్రులు ఇండియాలో తక్కువ. టీచర్లు పిల్లల చేతులు వాచిపోయేలా కర్రతో కొట్టినా ఫర్వా లేదు, పిల్లలకి చదువు వస్తే చాలు అనుకుంటారు కానీ అది పిల్లల హక్కుల ఉల్లంఘన అవుతుంది అనుకోరు. పోలీసులు నేరస్తుల మెడలో బోర్డులు కట్టినట్టు పిల్లల మెడలో బోర్డులు కట్టడం పిల్లలని అవమానించడమే. ఇక్కడ పిల్లలకి జరిగిన అవమానం గురించి ఎక్కువ బాధ పడకుండా తెలుగుకి జరిగిన అవమానం గురించి ఎక్కువ బాధ పడుతున్నారు. తెలుగుకి జరిగిన అవమానం గురించిన చర్చలో కేవలం అవమానం గురించి మాట్లాడారా? అనవసరంగా మత ప్రస్తావన తెచ్చి క్రైస్తవ, ఇస్లాం మతాల పైన విమర్శలకి తెలుగు అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. తెలుగు మీడియం టీచర్లు తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారో చెపితే అది చర్చకి సంబంధం లేని విషయం అట! మత ప్రస్తావన తీసుకురావడం మాత్రం చర్చకి అవసరమైన విషయమేనట! క్రైస్తవ స్కూళ్ళలోనే కాదు, హిందువులు నడిపే స్కూళ్ళలో కూడా తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ ని కర్రలతో కొట్టడం లాంటివి చేస్తారు. ఇక్కడ పనిష్మెంట్ విధానాన్ని విమర్శించాలి కానీ మతాన్ని విమర్శించడం వల్ల ఏమి ప్రయోజనం?

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply