మరో విప్లవ ద్రోహి వంగపండు ప్రసాద రావు

వంగపండు ప్రసాద రావుని విప్లవ ద్రోహిగా మావోయిస్ట్ నాయకుడు జనార్ధన్ ప్రకటించారు. రాజశేఖర రెడ్డిని పొగుడుతూ వంగపండు ప్రసాద రావు పాటలు పాడడం వల్ల ఈ ప్రకటన చెయ్యాల్సి వచ్చింది. ఈ విషయం గురించి ప్రసాద రావు మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డి తన కుటుంబానికి సహాయం చెయ్యడం వల్లే రాజశేఖర రెడ్డిని పొగిడానని చెప్పుకున్నాడు. రాజశేఖర రెడ్డి వల్ల కొన్ని కుటుంబాలకి ప్రయోజనం కలిగి ఉండొచ్చు కానీ సమాజం యొక్క సమిష్టి ప్రయోజనాల గురించి ఆలోచించకుండా రాజశేఖర రెడ్డిని పొగడడం హాస్యాస్పదమే. నల్లమలలో రాజశేఖర రెడ్డి మన వాళ్ళనే చాలా మందిని చంపించాడు. వంగపండు ప్రసాద రావు కేవలం తన కుటుంబ ప్రయోజనం కోసం విప్లవానికీ, సమాజానికీ వెన్నుపోటు పొడవడం సిగ్గు చేటు.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply