బతికుండగా హింసావాది, చనిపోయిన తరువాత శాంతి ప్రవక్త

రాష్ట్రంలో కేవలం 10% జనాభా ఉన్న ముస్లింల వోట్లు కోసం పక్కా హింసావాది అయిన నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ ని కూడా శాంతి ప్రవక్తగా మార్చేశారు మన వాళ్ళు. నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ రజాకార్ల చేత చెయ్యించిన హత్యలతో పోలిస్తే రాజశేఖర రెడ్డి కోబ్రా గ్యాంగులతో చెయ్యించిన హత్యలు తక్కువే. సికందరాబాద్ – వాడీ పాసింజర్ ట్రైన్ లో హిందూ మహిళల పై రజాకార్లు చేసిన ఘోరమైన గ్యాంగ్ రేప్ తో పోలిస్తే విశాఖపట్నం జిల్లా వాకపల్లిలో గిరిజన మహిళల పై గ్రేహౌండ్స్ ముఠా చేసిన గ్యాంగ్ రేప్ ఘోరత్వం తక్కువే. మహారాష్ట్రలో ఒస్మాన్ అలీ ఖాన్ పేరుతో ఒస్మానాబాద్ జిల్లా ఉంది, మన రాష్ట్రంలో మహబూబ్ అలీ ఖాన్ పేరుతో మహబూబ్ నగర్ జిల్లాకి ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఏజెంట్లు అయిన నిజాం ప్రభువుల పేర్లు జిల్లాలకి ఉండగా, వరల్డ్ బ్యాంక్ ఏజెంట్లలో ఒకడైన రాజశేఖర రెడ్డి పేరు కూడా ఓ జిల్లాకి ఉండడం విచిత్రమా?

RSS feed for comments on this post. TrackBack URI

Leave a Reply