మార్కెట్ వ్యామోహం
కంప్యూటర్ విడి భాగాలలో RAMలు, SMPSలు తప్ప మిగితావన్నీ ఖరీదైనవే. మా జిల్లాలోని ఆముదాలవలస పట్టణానికి చెందిన ఒక ఉద్యోగి తన కంప్యూటర్ లో మదర్ బోర్డు కాలిపోతే నాకు సెకండ్ హ్యాండ్ మదర్ బోర్డ్ అడిగాడు. నా దగ్గర ఉన్న పాత మదర్ బోర్డులు ఎప్పుడు కాలిపోతాయో తెలియదు. కాలిపోయేవి అమ్మడం ఎందుకు అని నేను అతనికి మదర్ బోర్డ్ అమ్మలేదు. ఫ్రెష్ మదర్ బోర్డ్ కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అమెరికా కంపెనీలు థాయిలాండ్ లాంటి పేద దేశాలలో ఎలెక్ట్రానిక్స్, కంప్యూటర్ విడి భాగాలు తయారు చెయ్యించి వాటి మీద తమ కంపెనీల బ్రాండ్ లు వేసి ఎక్కువ ధరకి మార్కెటింగ్ చేస్తాయి. అందుకే కంప్యూటర్లు, ACలు లాంటి వాటి ధరలు ఎక్కువ. “రాబందు నీడ” పుస్తకంలో వేణు గోపాల్ వ్రాసాడు “మార్కెట్ లో ఏ వస్తువు వచ్చినా అది డబ్బున్న వాళ్ళకీ, హైయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే సులభంగా అందుబాటులో ఉంటుంది” అని. గతంలో పాలక వర్గాన్ని తీవ్రంగా విమర్శించిన వేణు గోపాల్ ఈ మధ్య పాలక వర్గాన్ని విమర్శించడం ఎందుకు తగ్గించాడో దీన్ని బట్టి అర్థం అవుతుంది. అతను పేరుకి విప్లవకారుడే కానీ అతని ఇంక్లినేషన్ మాత్రం మార్కెట్ వ్యవస్థ వైపే ఉంది.
RSS feed for comments on this post. TrackBack URI